కె చంద్రశేఖర రావు కుటుంబం లబ్ధికోసమే టీఆర్ఎస్: దేవేందర్ గౌడ్

ప్రజల కష్టనష్టాలను పక్కనపెట్టి తెలంగాణ ముసుగులో టీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబం లబ్ధి పొందుతుందని విమర్శించారు. తెలంగాణలో వచ్చిన అనేక అభివృద్ధి మార్పులకు కారణం ఇక్కడ కీలకపాత్ర పోషించిన టిడిపిదేనని అందరికీ తెలుసన్నారు. తెలుగుదేశం పార్టీ నిర్వహించుకుంటున్న పార్టీ సభలో టీఆర్ఎస్ ఆందోళన నిర్వహించే కుసంస్కారం ఏమిటని ప్రశ్నించారు. పార్టీని భూస్థాపితం చేస్తాం ఆనటం ఎంత వరకు సమంజసమన్నారు. దీన్ని తెలంగాణ ప్రజలు ఆలోచించాలన్నారు. తెలంగాణలో నెలకొన్న బాబ్లీ, బయ్యారం, ఎరువులు, పలు ప్రజా వ్యతిరేక సమస్యలపై స్పందించని టీఆర్ఎస్ సమస్యలపై స్పందించిన తెలుగుదేశంపై దాడులు చేయటం దురదృష్టకరమన్నారు. అయినా ఏ పార్టీ పాలసీలు వారివి, ప్రతి ఒక్కరికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులలోనే వారు నడుచుకుంటారు. వాటిపై స్పందించాల్సింది ప్రజలు. వాటిని ప్రజల విజ్ఞతకు వదిలెయ్యాలని దేవేందర్ గౌడ్ సూచించారు.












Click it and Unblock the Notifications