చిరంజీవి తెలంగాణ వైఖరిపై కెటి రామారావు ఫైర్

ఎపిపిఎస్సీ చైర్మన్ వెంకట్రామిరెడ్డిని బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎపిపిఎస్సీ వ్యవహారాలపై కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతున్న తీరును ఆయన తప్పు పట్టారు. ఎపిపిఎస్సీ వ్యవహారాలపై వెంకట్రామి రెడ్డి కన్నా లగడపాటి ఎక్కువ విషయాలు మాట్లాడుతున్నారని, మెయిన్స్ పరీక్ష ఎప్పుడు పెడతారో.. వెంకట్రామిరెడ్డి ఎప్పుడు పదవీ విరమణ చేస్తారో లగడపాటి మాట్లాడుతున్నారని, ఈ వ్యవహారాలు ఒక పార్లమెంటు సభ్యుడికి ఎలా తెలుస్తాయని ఆయన అన్నారు. న్యాయవ్యవస్థలోని జిపి పోస్టుల్లో తెలంగాణవారికి 42 శాతం వాటా ఇవ్వాల్సిందేనని ఆయన చెప్పారు. ఎపిపిఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షలు రద్దు చేసి, తిరిగి నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
జిపి పోస్టుల్లో 42 శాతం వాటా కోరుతూ తెలంగాణ న్యాయవాదులు చేస్తున్న ఆందోళనకు తెరాస శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ మద్దతు తెలిపారు. న్యాయమైన డిమాండ్ తో తెలంగాణ న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారని ఆయన అన్నారు. ఎపిపిఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని, ఎపిపిఎస్సీ చైర్మన్ వెంకట్రామిరెడ్డిని బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎపిపిఎస్సీ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కూడా పాటించడం లేదని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications