రవీంద్రనాథ్ రెడ్డికి ముఖ్యమంత్రి రోశయ్య మద్దతిస్తున్నారా?

ముఖ్యమంత్రి సైతం రవీంద్రనాథ్ రెడ్డి కనిపించగానే పోలీసులను పిలిపించి జైళ్లో పెట్టించకుండా చర్యలు జరపటం వెనుక ఉద్దేశ్యం ఏమిటో ముఖ్యమంత్రి బహిరంగ పరచాలని డిమాండ్ చేశారు. రవీంద్రనాథ్ రెడ్డి పోలీసుల కళ్లుగప్పి తిరగటానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ముఖ్యమంత్రి 420లను కాపాడే ప్రయత్నంలో ఉన్నాడని, అలాంటి వ్యక్తికి పదవిలో కొనసాగే అర్హత లేదని వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
వైఎస్ బావమరిది ఐన కడప మేయరు రవీంద్రనాథ్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఐన తరువాతనే ప్లాంట్లు, కోట్లు సంపాదించాడన్నారు. అక్రమార్కుడైన రవీంద్రనాథ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే తెదేపా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని అన్నారు. రైతు సంఘాలు అన్ని కూడా కలిసి దీనిపై పోరాడటానికి సిద్ధమయ్యాయని వారికి తెలుగు దేశం అండగా నిలుస్తుందన్నారు.












Click it and Unblock the Notifications