కె చంద్రశేఖర రావుకు లగడపాటి రాజగోపాల్ కితాబు

భారతంలో శ్రీకృష్ణ రాయబారం విఫలమైనా శ్రీకృష్ణ కమిటీ పరిస్థితి చక్కదిద్దేందుకు, సమస్యను పరిష్కరించేందుకు ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం జెఎసి నాయకులు ఆవేశపూరితంగా మాట్లాడుతున్నారని, వారిని తప్పు పట్టాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. విద్యార్థులు ఆవేశంలో ఉద్యమాలు చేయడం, డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళనలు చేపట్టడం తప్పు కాదని, అయితే వాస్తవాలు గ్రహించి విద్యార్థులు సక్రమ మార్గంలో నడిచేలా చూడాల్సి ఉంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications