Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణలో తిరగనివ్వం: ఆ మంత్రులకు ఒయు జెఎసి హెచ్చరిక

Osmania University
హైదరాబాద్: తెలంగాణ పార్లమెంటు సభ్యులపై విమర్శలు చేసిన ముగ్గురు మంత్రులపై ఉస్మానియా విశ్వవిద్యాలయం జెఎసి మండిపడింది. తెలంగాణ పార్లమెంటు సభ్యులు మధు యాష్కీ, మందా జగన్నాధం, గుత్తా సుఖేందర్ రెడ్డి, జి. వివేక్ ల తీరుపై మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, దామోదరం నరసింహ సోమవారం మంత్రివర్గం సమావేశంలో చేసిన విమర్సలపై ఒయు జెఎసి మంగళవారం తీవ్రంగా ప్రతిస్పందించింది. ఆ ముగ్గురు మంత్రుల దిష్టిబొమ్మలను ఒయు జెఎసి కార్యకర్తలు దగ్ధం చేశారు. ఆ మంత్రులను తెలంగాణలో తిరగనివ్వబోమని వారు హెచ్చరించారు. మంత్రులపై తెలంగాణ న్యాయవాదుల జెఎసి కూడా తీవ్రంగా మండిపడింది.

కాగా, మంత్రులను కాంగ్రెసు శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి సమర్థించారు. ప్రభుత్వంలో ఉండి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు ఆ నలుగురు పార్లమెంటు సభ్యులు వత్తాసు పలుకుతున్నారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆ నలుగురు ఎంపిలపై తాము పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+