కెసిఆర్! నీ నోటిని ఫినాయిల్ తో కడుక్కో: దేవేందర్ గౌడ్

తెలంగాణ విషయంలో కెసిఆర్ పై తాను గతంలో వ్యాఖ్యానించిన తెలంగాణకు కెసిఆర్ అడ్డంకి అన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు. ఆ విషయంలో బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. కెసిఆర్ కేంద్రానికి ఒక అమ్మకపు వస్తువు అని, సమయానుకూలంగా ఆయన రేటు మారుతుందని దుయ్యబట్టారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరితో ఉండి, తెలంగాణ కోసం అహర్నిషలు పాటుపడుతున్న తెలుగు దేశాన్ని విమర్శించటం ద్వారా కెసిఅర్ తెలంగాణపై తనకున్న చిత్తశుద్ధిని బయట పెడుతుందన్నారు.
కుటుంబ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాలు బలిపెట్టుతున్న కెసిఆర్ కుట్ర రాజకీయాలు ప్రజలు తెలుసుకుంటున్నారని, గురువారం సీమాంధ్ర వ్యాపార సీఈవోలతో ఆయన తన లాభం కోసమే సమావేశమయ్యారన్నారు. తెలంగాణలో పార్టీని నిలబెట్టుకోలేక అనేక కుతంత్రాలు పన్నుతున్నాడని, పార్టీలోకి ఎవరూ రాక, ఉన్నవారినీ నిలుపుకోలేక వారిని ఆకర్షించి ఉంచటానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. రాజకీయ లబ్ది కోసమే ఆయన చాలా కుతంత్రాలు చేస్తున్నారన్నారు. కెసిఆర్ హీరో అనుకుంటున్నాడని, నోరు ఆదుపులో పెట్టుకోవాలని లేకుంటే తెలంగాణ ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమన్నారు. నోటిని ఫినాయిల్ తో కడుక్కోవాలని హితవు పలికారు.












Click it and Unblock the Notifications