వైయస్ జగన్ వర్గీయులకు పిసిసి అధ్యక్షుడు డిఎస్ వార్నింగ్

Srinivas
హైదరాబాద్: తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెందినవారికి ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. వైయస్ బొమ్మ పెట్టుకుని గెలిచామని కొందరు నాయకులు అంటున్నారని, ఎవరి బొమ్మలు పెట్టుకుని గెలిచారో చిన్న పిల్లలను అడిగినా చెప్తారని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కొంత మంది నాయకులు వ్యూహాత్మకంగా పార్టీపై విమర్శలు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. సోనియాను, పార్టీని కించపరిచే వ్యాఖ్యలను ఇక సహించబోమని, అటువంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. భిన్నాభిప్రాయాలుంటే పార్టీ వేదికల మీదనే మాట్లాడాలని, బహిరంగంగా మాట్లాడకూడదని ఆయన అన్నారు. ఎంపిల సమావేశం మంచి ఫలితం ఇచ్చిందని, రేపటి పిసిసి సమావేశం యథాతథంగా జరుగుతుందని ఆయన చెప్పారు.

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి మరణం వల్ల షాక్ కు గురై మరణించినవారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎఐసిసి నుంచి ఓ జాబితా అందిందని ఆయన చెప్పారు. జిల్లా అధ్యక్షులు, మంత్రులు, ఇంచార్జీ మంత్రులు బాధితుల వివరాలు వారంలోగా తమకు అందిస్తారని, ఆ జాబితాను తిరిగి తాము అధిష్టానానికి పంపుతామని, తుది జాబితాను తయారు చేసి బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని ఆయన చెప్పారు. మీడియాతో మాట్లాడి పార్టీ గౌరవాన్ని తగ్గిస్తున్న నాయకులపై తమ పరిధిలో ఉంటే వెంటనే చర్యలు తీసుకుంటామని, తమ పరిధిలోకి లేకపోతే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+