నల్గొండ: నల్గొండ జిల్లాలోని ఆలేరు రైల్వే స్టేషన్ లో ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జహీరాబాద్ కు చెందిన యోగేశ్, స్వప్నలు బుధవారం ఉదయం ఆలేరులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అక్కడ పడిపోయి ఉన్న వారిని స్థానికులు గమనించి పోలీసులకు తెలిపారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ లోని నిమ్స ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే యోగేశ్ మరణించాడు. స్వప్న ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కాగా ప్రియురాలు స్వప్నకు ఇంతకుముందే పెళ్లి అయ్యింది. ఆమెకు ఓ కొడుకు కూడా ఉన్నాడు.