వైయస్ జగన్ కు వచ్చేకన్నా ఎక్కువ జనం వస్తారు: ఎంపీ వివేక్

మంగళవారం కాంగ్రెసు సీనియర్ నాయకులు వి.హనుమంతరావు డబ్బులు ఇస్తేనే జగన్ సభకు అంతమంది జనాలు వస్తున్నారని ఆరోపించారు. దానికి మేకపాటి స్పందిస్తూ హనుమంతరావు సభలు ఏర్పాటు చేసుకుంటే తాను డబ్బులు ఇస్తానని, సభలు ఏర్పాటు చేసుకొని ఎంతమంది జనాలు వస్తారో చూసుకొవచ్చునన్నారు. రాష్ట్రంలో తన ప్రజల్లో తనకు ఎంత పరపతి ఉందో హనుమంతరావు తెలుసుకోవచ్చునన్నారు. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ తనకిష్టమున్న ప్రాంతంలో సభ ఏర్పాటు చేసుకొని పరిశీలించుకోవచ్చునన్నారు. దీంతో మేకపాటి సవాల్ కు ఎంపీ వివేక్ స్పందించి, తనకు డబ్బులు ఇస్తే సమావేశాలు పెట్టుకోవడానికి సిద్ధమని చెప్పారు












Click it and Unblock the Notifications