సత్యంబాబుకు శిక్ష: కోర్టుకు తాళాలు, తీవ్ర నిరసనలు

ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. కోర్టు ఆవరణకు వేసిన తాళాలను తీశారు. సత్యంబాబును జైలుకు తరలించారు. తీర్పు వెలువరించిన న్యాయమూర్తికి ఉద్దేశ్యాలు అంటగట్టకూడదని డిఫెన్స్ లాయర్ అన్నారు. కేసులో లొసుగులు ఏమున్నాయో పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మహిళా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని న్యాయవాదులు చెప్పారు. న్యాయవాదులు కూడా కోర్టు తీర్పుపై నిరసన వ్యక్తం చేశారు. సత్యంబాబుకు ఉరిశిక్ష వేయవద్దని డిఫెన్స్ లాయర్ చేసిన విజ్ఞప్తిని కోర్టు పరిశీలనకు తీసుకుంది. సత్యంబాబుకు అయేషా మీరా కేసుతో ఏ విధమైన సంబంధం లేదనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. కోర్టు కేవలం సాంకేతిక సాక్ష్యాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుందని, ప్రత్యక్ష సాక్ష్యాలు ఈ కేసులో ఏవీ లేవని, ఈ స్థితిలో సత్యంబాబుకు శిక్ష వేయడం సరి కాదని వాదిస్తున్నారు.












Click it and Unblock the Notifications