సంయమనం పాటించండి: మజ్లీస్ నేత అసదుద్దీన్ ఓవైసీ పిలుపు

అయోధ్య తీర్పు నేపధ్యంలో ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఎ.కె.ఖాన్ కోరారు. తీర్పు ఎలా ఉన్న అందరూ దాని పట్ల అందరూ సామరస్యంగా ఉండాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే నగరంలో పటిష్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. యువత శాంతికోసం కృషి చేయాలన్నారు. పలు సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి అక్కడ పోలీసులను మోహరించామన్నారు. ఇప్పటికే ఎలాంటి ఎస్సెమ్మెస్ లకు, ఎమ్మెమ్మస్ లకు నిరోధించామన్నారు.
హైదరాబాదులో కర్ఫ్యూ వాతావరణం ఏర్పడింది. మధ్యాహ్నం నుంచి విద్యాసంస్థలు సెలవులు ప్రకటించాయి. పాతబస్తీలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వివిధ వర్గాల నాయకులు సంయమనం పాటించాలని పిలుపునిస్తున్నారు.












Click it and Unblock the Notifications