నల్గొండ: నల్లగొండ జిల్లా ఓ గూడ్సు రైలులో మంటలు ఎగిసిపడటంతో స్థానికంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భువనగిరి రైల్వేస్టేషన్‌లో నిలిచి ఉన్న గూడ్సు రైలులోని ఓ భోగీలో నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. ఆ గూడ్సు రైలు బొగ్గుతో నిండి ఉన్నది.దాంతో ఓ బోగీలోని బొగ్గుకు మంటలు అంటుకున్నాయి. మంటలు రేగటంతో అందులో బొగ్గు ఉండటంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే మంటలు వ్యాపించకుండా ఉండటానికి ఫైరింజన్ లను రప్పించారు. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తోంది.