హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిని తమ అధినేత కె.చంద్రశేఖర రావు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానన్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తనతో చెప్పారని టిడిపి నేత నాగం జనార్ధన్ రెడ్డి విలేకరుల సమావేశంలో అన్నారు. చంద్రశేఖర రావు తెలంగాణ ఆత్మాభిమానాన్ని అమ్ముకునేలా మాట్లాడినందునే తాము అంత సీరియస్ గా రియాక్టు అయ్యామని ఆయన అన్నారు. తెలంగాణ వచ్చాక తాను సిఎం పదవిని ఆశించటం లేదని, తనకు తెలంగాణ రావటం ముఖ్యం. కానీ పదవుల మీద ఆశ లేదని నాగం వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం ఎవరిపై పడితే వారిపై ఒత్తిడి తేవటం సరి కాదని, ఇవ్వాల్సిన వారిపై ఒత్తిడి తేవాలని సూచించారు. కేంద్రంపై తెలంగాణ వారందరూ పార్టీలకతీతంగా ఒత్తిడి తీసుకు రావాలని, ఆలా అయితేనే కేంద్రం దిగి వస్తుందని అన్నారు. ఈనెల 25న సోనియాగాంధీ ఇంటిముందు తలపెట్టిన ధర్నాలో కెసిఆర్ తోపాటు ఆందరూ పాలుపంచుకోవాలని సూచించారు.