వర్ధమాన దేశాల మధ్య ఐకమత్యంతోనే అభివృద్ధి: పిఎం మన్మోహన్

పేదలు, దిగువ స్థాయి ప్రజల జీవితాల మెరుగు శాస్త్ర, సాంకేతిక పరిశోధనలు ఉపయోగపడాలని ఆయన అన్నారు. ప్రపంచీకరణ, కమ్యూనికేషన్ల వల్ల వర్ధమాన దేశాలకు మంచి అవకాశం లభించిందని, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ముందుకు సాగడానికి వీలు ఏర్పడిందని ఆయన అన్నారు. వర్ధమాన దేశాల పరిశోధనలకు మానవ శక్తి, మౌలిక సదుపాయాల కొరత ఉందని, వాటిని అధిగమించడానికి భారత తగిన చర్యలు తీసుకుంటోందని, పలు సంస్థలను ఏర్పాటు చేస్తోందని ఆయన చెప్పారు. వర్ధమాన దేశాలు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించాల్సి ఉందని, ఇందుకు శాస్త్రవేత్తలు తమ పరిధశోధనలను ప్రజలకు చేరవేయాల్సి ఉందని ఆయన అన్నారు. వర్ధమాన దేశాల సమస్యలకు శాస్త్ర విజ్ఞానం మాత్రమే సమాధానం చెప్పగలుగుతుందని ఆయన అన్నారు.
గత ఇరవై ఏళ్లుగా హైదరాబాదు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిందని ముఖ్యమంత్రి కె.రోశయ్య చెప్పారు. ఫార్మా కంపెనీలు, విద్యాసంస్థలు హైదరాబాదులో పెద్ద యెత్తున వెలిశాయని ఆయన చెప్పారు. సదస్సు ప్రారంభ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, కేంద్ర సైన్స్ శాఖ సహాయ మంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. గణాంక శాస్త్రవేత్త సిఆర్ రావుకు ఇండియన్ సైన్స్ అవార్డును అందించారు. ఇతర శాస్త్రవేత్తలను ఆయన సన్మానించారు.












Click it and Unblock the Notifications