టీడీపీ అధినేత చంద్రబాబుపై ముఖ్యమంత్రి రోశయ్య విసుర్లు

పార్టీలు బయట ఒకమాట లోపల ఒకమాట మాట్లాడటం సరికాదన్నారు. అఖిలపక్షంలో ఓ మాట మాట్లాడి బయట మరోవిధంగా పలు పార్టీలు ప్రవర్తిస్తున్నాయన్నారు. టాటా ఇన్సిట్యూట్ ఫర్ ఫండమెంటల్ రీసెర్చ్ ఇన్సిట్యూట్ ను అడ్డుకోవటం ప్రగతి నిరోధక చర్య అవుతుందన్నారు. ప్రగతిని కాంక్షించేవారు పరిశ్రమల అభివృద్ధిని అడ్డుకోరన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ తో అఖిలపక్షాన్ని కలిపించడానికి ప్రభుత్వం తరఫున అన్ని ప్రయత్నాలు చేశామని, అయితే ఆయనకు సమయం లేనందున కలవలేక పోయారన్నారు. దీనిని ప్రతిపక్షాలు అర్థం చేసుకోకపోవటం శోచనీయమన్నారు.












Click it and Unblock the Notifications