ఎమ్మార్ పై బొందిలో ప్రాణాలు ఉండగా రాజీ పడేది లేదు: డిఎల్ రవీంద్రారెడ్డి

DL Ravindra Reddy
హైదరాబాద్‌: ఎమ్మార్ ప్రాపర్టీస్ పై తన బొందిలో ప్రాణాలు ఉండగా రాజీ పడేది లేదని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు డిఎల్ రవీంద్రా రెడ్డి స్పష్టం చేశారు. ఇన్నాళ్లు తాను ఎమ్మార్ ప్రాపర్టీస్ స్థలంలో ఎవరెవరికి ఇళ్లు ఉన్నాయనే వివరాలు సేకరించడంలో మునిగిపోయానని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. కావాలంటే తన ఫోన్ నెంబర్లు, ఇంటి చిరునామాను మీడియా ప్రతినిధులకు ఇస్తానని ఆయన చెప్పారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తూనే ఉంటానని ఆయన చెప్పారు.

కామన్ వెల్త్ క్రీడల అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మార్ ప్రాపర్టీస్ పై విచారణకు ఆదేశించాలని ఆయన అభిప్రాయపడ్డారు. అవసరమైతే కోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేస్తానని ఆయన చెప్పారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ పై పెద్దలకు చెప్పడానికి తాను ఢిల్లీ వెళ్తానని ఆయన చెప్పారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాల్సిందేనని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+