మెడనొప్పితో ఆగిపోయిన వైయస్ జగన్ ఓదార్పు యాత్ర

అయినా షెడ్యూల్ ప్రకారం యాత్ర కొనసాగించాలన్న ఉద్దేశంతో యువనేత శుక్రవారం కూడా యాత్రకు బయల్దేరి వెళ్లారు. శుక్రవారం రాత్రి యాత్ర ముగిసిన అనంతరం వైద్యులు ఆయనను మరోసారి పరీక్షించారు. మెడనొప్పి మరింత తీవ్రం కావడంతో కనీసం ఒకరోజు విశ్రాంతి అవసరమని సూచించారు. చికిత్స కొనసాగించారు. దీంతో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి స్థానిక నేతలతో చర్చించి ఓదార్పు యాత్రకు ఒకరోజు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించారు. ఆదివారం నుంచి ఓదార్పు యాత్ర యథాతథంగా కొనసాగనుంది.












Click it and Unblock the Notifications