రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబు సూక్ష్మ బాట: వట్టి వసంత్ కుమార్

రాహుల్ గాంధీ, సోనియా గాంధీని సూక్ష్మ రుణ సంస్థల ఘటనలకు ఆపాదించి రాజకీయంగా మళ్లీ తిరిగి తన ప్రాబల్యం పెంచుకుందామనుకోవటం చంద్రబాబు అమాయకత్వం అనిపించుకుంటుందన్నారు. విక్రమ్ తో కూర్చున్నంత మాత్రాన రాహుల్ తప్పు చేసినట్లు అయితే, దొంగనోట్ల సృష్టికర్త రామకృష్ణతో ఫోటో దిగిన చంద్రబాబుకు దొంగనోట్ల అక్రమాల్లో ప్రమేయమున్నట్లేనా అని ప్రశ్నించారు. షేర్, ఎస్ కె ఎస్, స్పందన, నిర్మల వంటి సూక్ష్మరుణ సంస్థలు చంద్రబాబు హయాంలోనే వచ్చాయని గుర్తు చేశారు. అలాంటప్పుడు ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ ను విమర్శిస్తాడని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications