కాశ్మీర్ పై వ్యాఖ్యలకు అరుంధతీ రాయ్ పై దేశద్రోహం కేసు?

Arundhati Roy
న్యూఢిల్లీ: బుకర్ ప్రైజ్ విజేత, ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ పై దేశద్రోహం కేసు నమోదు చేసే విషయంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. భారత్‌లో కాశ్మీర్ అంతర్భాగం కాదంటూ అరుంధతి రాయ్ చేసిన వ్యాఖ్యలు దేశంలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగానే స్పందించింది. మంచి పేరున్న రచయిత్రి ఇలాంటి వివాదాస్ప వ్యాఖ్యలు చేయడం తగదని, వెంటనే తన వ్యాఖ్యలను ఆమె ఉపసంహరించుకోవాలని ఏఐసీసీ సభ్యుడు సత్య ప్రకాష్ మలావియా డిమాండ్ చేశారు. అరుంధతిరాయ్ చరిత్రను వక్రీకరించే రీతిలో ప్రకటన చేశారన్నారు. ఇది ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తోందని, చరిత్ర నిజాలను వక్రీకరించడమే అవుతుందన్నారు. ముఖ్యంగా, దేశాన్ని, అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టించడమేనన్నారు. అందువల్ల ఆమె చేసిన వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

కాగా, కాశ్మీర్ హురియత్ సంస్థ నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీపై దేశ ద్రోహం కేసు నమోదుకు కేంద్ర అంతర్గత వ్యవహారాల శాఖ అనుమతినిచ్చింది. ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో వేర్పాటువాదాన్ని రెచ్చగొట్టే తీరులో వ్యాఖ్యానించిన గిలానీపై దేశ ద్రోహం కింద కేసు నమోదు చేసేందుకు గాను ఢిల్లీ పోలీసులకు కేంద్ర అంతర్గత వ్యవహారాల శాఖ అనుమతినిచ్చింది. ఢిల్లీలో జరిగిన ఈ సదస్సులో ప్రముఖ రచయిత అరుంధతి రాయ్, విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు పాల్గొన్నారు. ఈ సదస్సులో సయ్యద్ అలీ షా గిలానీ మాటలు వేర్పాటు వాదాన్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని భారతీయ జనతా పార్టీతో పాటు విపక్షాలన్నీ తీవ్రంగా ఖండించాయి. ఇంకా గిలానీపై తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ డిమాండ్ చేశారు.

భారత్ ఒకే దేశం కాదని, దేశాన్ని పలు భాగాలుగా విడగొట్టాలని వ్యాఖ్యానించిన గిలానీపై కఠిన చర్యలు తీసుకోవాలని జైట్లీ కోరారు. అతనిపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గుతున్నట్లు జైట్లీ ఆరోపించారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వారిని పోలీసులు అరెస్టు చేయాలని ఆయన సూచించారు. అయితే జైట్లీ ఆరోపణలను కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ఖండించారు. గిలానీ పాల్గొన్న సదస్సుకు చెందిన వీడియో అంతర్గత వ్యవహారాల శాఖ పరిశీలనలో ఉందని, చట్టప్రకారం ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఈ నేపథ్యంలో గిలానీపై చర్యలు తీసుకునేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని న్యాయశాఖ పేర్కొంది. దీంతో కేంద్ర అంతర్గత వ్యవహారాల శాఖ గిలానీపై కేసు నమోదు చేసేందుకు అంగీకరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+