డిఎల్ వ్యాఖ్యతో బెదిరిన చంద్రబాబు: సిబిఐ విచారణకు డిమాండ్

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి రోశయ్యకు మరో లేఖ రాశారు. ఎమ్మార్ కుంభకోణంపై వెంటనే సిబిఐ విచారణ జరిపించాలని ఆయన తన లేఖలో ముఖ్యమంత్రిని కోరారు. ఎమ్మార్ కుంభకోణంలో కాంగ్రెస్ వారి హస్తం ఉందనే విషయం ప్రజలకు, ప్రభుత్వానికి తెలుసునన్నారు. వెంటనే విచారణ జరిపి వారిపై చర్య తీసుకోవాల్సిన బాధ్యత రోశయ్య ప్రభుత్వంపై ఉందన్నారు. లేకుంటే ప్రజలు రోశయ్యకు ఇందులో భాగస్వామ్యం ఉందని భావించవలసి వస్తుందన్నారు.
ఆదివాసీల కోసం అభ్యన్నతికి, వారి హక్కులకోసం పోరాడిన అదిలాబాద్ జిల్లా యోధుడు కొమురం భీం విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయకుంటే తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో తీవ్ర ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications