చంద్రబాబు రెండు కళ్లలో ఒక కన్ను పోయింది: గద్దర్

టాంకుబండ్ పైన కొమురం భీం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్ని డిమాండ్ సరియైనదేనని, అయితే అక్కడున్న సీమాంధ్రుల విగ్రహాలు కూల్చి కొమురం భీం విగ్రహాన్ని నెలకొల్పుతామని ప్రకటించడాన్ని మాత్రం తాను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. వేమవ విగ్రహాన్ని కూల్చితే ముందుగా తానే అడ్డుకుంటానని హెచ్చరించారు. నవంబర్ 1ని విద్రోహ దినంగానే జరుపుకుంటామన్నారు. ఆ రోజు తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో సుందరయ్య పార్కు వద్ద పెద్ద ఎత్తున నిరసన నిర్వహిస్తామన్నారు.
చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం పనికి రాకుండా పోయిందని విమర్శించారు. ఆయన రెండు కళ్లలో ఒక కన్ను కోల్పోయారని చెప్పారు. 20 ఏళ్లుగా తెలంగాణ జీవన విధానం ధ్వంసమయిందని, అయితే అందుకు ప్రజలు ఆవేశ పడకూడదని, శాంతియుతంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications