రాష్ట్రావతరణ దినోత్సవాలలపై లగడపాటి రాజగోపాల్ వర్సెస్ హరీష్ రావు

మంత్రుల దిష్టిబొమ్మలను దగ్ధం చేసి వారిని గ్రామాల్లో తిరగనివ్వకుండా అడ్డుకుంటామన్నారు. ఆత్మత్యాగానికైనా సిద్ధపడుతామని ఆయన గురువారం మీడియా ప్రతినిదుల సమావేశంలో అన్నారు. తెలంగాణ అమరవీరులకు సాయం చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంలో పాల్గొంటే వారి కుటుంబాలను అవమానించినట్లేనని అన్నారు. తెలంగాణ ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు ఈ ఉత్సవాల్లో పాల్గొనవద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణను తమ నేత కెసిఆర్ ఆకాశానికెత్తితే తెలుగుదేశం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు చంద్రబాబు కాళ్ల వద్ద పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా, రాష్ట్ర అవతరణ దినాన్ని విద్రోహ దినంగా పరిగణించడం బూర్గుల రామకృష్ణ రావు వంటి తెలంగాణ మహా నాయకులను అవమానించడమేనని లగడపాటి రాజగోపాల్ అన్నారు. చరిత్ర తెలియకుండా నోరు పారేసుకోవడం తెలంగాణ నాయకులకు తగదని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. డిసెంబర్ 31వ తేదీ తర్వాత విజయవాడలో హైకోర్టు బెంచ్ ఏర్పాటవుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రావతరణ దినోత్సవాల్లో పాల్గొనాలనే నిర్ణయాన్ని తెలంగాణ ప్రాంత మంత్రులు పునరాలోచించుకోవాలని తెలంగాణకు చెందిన కాంగ్రెసు ఎమ్మెల్సీ యాదవ రెడ్డి కోరారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాలను బహిష్కరించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధనకు కట్టుబడి ఉన్నామనే విశ్వాసాన్ని కలిగిద్దామని ఆయన కోరారు. రాష్ట్రావతరణ దినోత్సవాలను బహిష్కరించాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications