రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకున్న వైయస్ జగన్

YS Jagan
హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకున్నట్లే అర్థమవుతోంది. కాంగ్రెసు పార్టీతో తెగదెంపులు చేసుకోక తప్పదనే అభిప్రాయానికి ఆయన వచ్చినట్లు కనిపిస్తోంది. సొంత బలం, సొంత పార్టీతోనే ఆయన ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు అనిపిస్తోంది. ఆయనకు దాదాపు అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న అంబటి రాంబాబు మాటలను బట్టి ఆ విషయం అర్థమవుతోంది. ఈ విషయాన్ని ఆయన ఓ ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కొంత స్పష్టంగానూ కొంత నర్మగర్భంగానూ చెప్పారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, అధిష్టానానికి భయపడేది లేదని, జగన్ ముందుకే సాగుతారని ఆయన చెప్పారు. దీన్ని బట్టి వైయస్ జగన్ సోనియాను, అధిష్టానాన్ని ధిక్కరించేందుకే సిద్ధపడినట్లు అర్థం చేసుకోవచ్చు.

రాహుల్ గాంధీపై ఆయన పరోక్ష విమర్శలు కూడా చేశారు. రాష్ట్ర యువజన కాంగ్రెసు కమిటీని రద్దు చేయడంపై ఆయన ధ్వజమెత్తారు. కమిటీ నాయకులు జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొంటున్నారనే అక్కసుతో కమిటీని రద్దు చేశారని ఆయన విమర్శించారు. దానివల్ల రాష్ట్రంలో పార్టీ నిర్వీర్యమవుతుందని ఆయన ధ్వజమెత్తారు. యువజన కాంగ్రెసు వ్యవహారాలను రాహుల్ గాంధీ చూస్తున్నారని తెలిసీ ఆయన విమర్శలు చేయడానికి వెనకాడలేదు. ఇది వైయస్ జగన్ తెగింపును తెలిజేయజేస్తోందని అంటున్నారు. ఓదార్పు యాత్రలో పాల్గొనని ఆనం బ్రదర్స్ ను తాము విమర్శించడం లేదని, సహకారం అందించదడం లేదని మాత్రమే అంటున్నామని, జగన్ ఓదార్పు యాత్రకు వ్యతిరేకంగా పనిచేయడాన్ని తప్పు పడుతున్నామని ఆయన అన్నారు. సోనియా గాంధీపై కూడా అంబటి రాంబాబు పరోక్ష విమర్శలు చేశారు.

వైయస్ ను కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు వి. హనుమంతరావు, కె. కేశవరావు సమైక్యవాదిగా అభివర్ణించడాన్ని తప్పు పడుతూ అలా చూస్తే సోనియా, ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా సమైక్యవాదులేనని ఆయన అన్నారు. వైయస్సార్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నారనే విమర్శను కూడా సోనియా వైపే తిప్పారు. పార్టీ అధిష్టానం తెలంగాణ ఇస్తానంటే వైయస్సార్ అడ్డుపడేవారా అని అడిగారు. అధిష్టానాన్ని వైయస్ శిరసా వహిస్తూ వచ్చారని, పైగా ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వైయస్సార్ కు అధిష్టానం జాతీయ స్థాయిలో తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకించగలరా అని ఆయన అన్నారు. సోనియా తీసుకున్న నిర్ణయ భారాన్ని వైయస్సార్ మోశారని, తెలంగాణకు వ్యతిరేకంగా అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై తనపై విమర్శలు వచ్చినా భరించారని ఆయన అన్నారు. వి. హనుమంతరావును ఆయన వీధిరౌడీగా అభివర్ణించారు.

వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో ఎవరూ పాల్గొనకున్నా ప్రజలు ఆదరిస్తున్నారని ఆయన చెప్పారు. జగన్ ఓదార్పు యాత్రకు విశేష ప్రజాదరణ లభిస్తోందని, ఆ ప్రజాబలంతోనే వైయస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన అన్నారు. ఎన్టీరామారావు, చంద్రబాబు, వైయస్ రాజశేఖర రెడ్డి ప్రజాబలంతోనే ముఖ్యమంత్రులయ్యారని, జగన్ కూడా ప్రజాబలంతోనే ముఖ్యమంత్రి అవుతారని ఆయన అన్నారు. నెల్లూరు జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర వచ్చే నెల 7వ తేదీన ముగుస్తోంది. ఆ తర్వాత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పాల్గొనడానికి ఆయన ఢిల్లీ వెళ్తారు. సమావేశాలు దాదాపు రెండు నెలల పాటు ఉంటాయి. ఆ తర్వాత ఆయన తిరిగి ఓదార్పు యాత్ర చేపడతారు. తెలంగాణలోనూ ఓదార్పు యాత్ర చేస్తారని అంబటి రాంబాబు అంటున్నారు. దీన్ని బట్టి వైయస్ జగన్ ఓదార్పు యాత్ర దీర్షకాలిక కార్యక్రమమని తెలుస్తోంది. ఓదార్పు యాత్ర ద్వారా వైయస్ అభిమానుల బలాన్ని అంచనా వేసుకుని, వారిని కూడగట్టి వచ్చే ఎన్నికల నాటికి ఓట్ల రూపంలోకి మార్చుకోవాలనేది ఆయన ఎత్తుగడగా కనిపిస్తోంది. కాంగ్రెసు అధిష్టానం తనకు ముఖ్యమంత్రి కావడానికి అవసరమైన అవకాశం కల్పించకపోతే, సొంత పార్టీ పెట్టి తన లక్ష్యాన్ని సాధించుకోవాలనే ఉద్దేశంతో వైయస్ జగన్ ఉన్నట్లు కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+