సహనం కోల్పోతే అది తెలంగాణ ప్రజల తప్పు కాదు: కెసిఆర్

డిసెంబర్ తర్వాత రాష్ట్రానికి కేంద్ర బలగాలను రప్పిస్తామని డిజిపి అరవింద్ రావు చేసిన ప్రకటనను ఆయన తప్పు పట్టారు. అటువంటి ప్రకటనలు చేసి డిజిపి ఆభాసుపాలు కావద్దని ఆయన సూచించారు. బలగాలు ఉద్యమాలను ఆపలేవని ఆయన అన్నారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని మరోసారి శ్రీకృష్ణ కమిటీకి విన్నవిస్తానని ఆయన చెప్పారు. తెలంగాణ ఇస్తామని హోం మంత్రి పి. చిదంబరం రాజ్యసభలో, లోకసభలో ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలని, లేకుంటే పార్లమెంటు గౌరవం తగ్గుతుందని ఆయన అన్నారు. కెసిఆర్ పది రోజుల పాటు ఢిల్లీలో ఉండి తెలంగాణకు అనుకూలంగా మద్దతు కూడగడుతారని అంటున్నారు.












Click it and Unblock the Notifications