వైయస్సార్ బంధువు క్రిస్టోఫర్ పై రామోజీ ఈనాడు డైలీ దాడి

YS Rajasekhar Reddy
హైదరాబాద్‌: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సమీప బంధువు అయిన ఉన్నత విద్యామండలి కార్యదర్శి క్రిస్టోఫర్ పై రామోజీ రావుకు చెందిన ఈనాడు దినపత్రిక తీవ్ర ఆరోపణలు చేసింది. ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపించింది. దానిపై విచారణ జరిపించేందుకు ఉన్నత విద్యామంత్రి శ్రీధర్ బాబు సూచన ప్రాయంగా వెల్లడించినట్లు తెలిపింది.వృత్తి విద్య కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాల్లో కంప్యూటర్లు, సర్వర్ల కొనుగోళ్లు, మండలి కార్యాలయంలో మౌలిక సదుపాయాల కల్పన, ఫర్నిచర్‌ కొనుగోళ్లలో భారీఎత్తున అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయని, టెండర్లు పిలవకుండానే మండలి ద్వారా కొనుగోళ్లు జరిగాయని, ఆదాయానికి మించి ఆస్తులను సంపాదించారని కార్యదర్శిపై వచ్చిన ఫిర్యాదును అనుసరించి లోకాయుక్త ఇప్పటికే విచారణ చేపట్టిందని, ఉన్నత విద్యా మండలి, ఉన్నత విద్యా శాఖ, రాజ్‌భవన్‌కు కూడా ఫిర్యాదులు వెళ్లాయని, వృత్తి విద్యా కళాశాలలు యాజమాన్య కోటాలో చేపట్టే సీట్ల భర్తీకి ఆమోదం తెలపడంలోనూ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలున్నాయని ఈనాడు తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది.

మండలిలో రూ.కోట్ల విలువైన కొనుగోళ్లన్నీ చిన్నచిన్న ఉద్యోగుల ద్వారానే చేపట్టేవారని, ఈ విషయాన్ని గమనించి ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా అధికారి కావాలని ఇటీవల జరిగిన పాలకమండలి సమావేశంలో తీర్మానించారని, మండలికి కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాతేఈ తీర్మానం చేశారని, నిధులు దుర్వినియోగం అవుతున్న సంగతి ఆనాటి ప్రభుత్వ పెద్దల దృష్టికి వచ్చినా పట్టించుకోలేదని ఈనాడు రాసింది. క్రిస్టోఫర్‌ పదవీకాలం వచ్చే ఏడాది జూన్‌లో ముగియనుంది. ఇప్పటికే రెండుసార్లు పదవీకాలం పొడిగించినందున ఉపకులపతి పదవిపై దృష్టిసారించి దరఖాస్తు చేశారు. తాజాగా ఉన్నత విద్యా మండలిలోని ఉపాధ్యక్ష పదవిని కూడా ఆశిస్తూ దరఖాస్తు చేశారు. పెద్దలను ప్రసన్నంచేసుకునే ప్రయత్నం చేసినా ఎక్కడా సానుకూలం వ్యక్తం కాలేదని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+