వైయస్ జగన్ సాక్షిపై దాడులకు జర్నలిస్టుల నిరసన, ధర్నా

Sakshi
హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు చెందిన సాక్షి దినపత్రిక కార్యాలయాలపై దాడులకు నిరసనగా జర్నలిస్టులు సోమవారం హైదరాబాదులో ధర్నా చేశారు. హైదరాబాదులోని ఆబిడ్స్ లో వారు ధర్నాకు దిగారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య (ఎపిడబ్ల్యుఎస్) ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. సాక్షిపై దాడులు పత్రికా స్వేచ్ఛకు భంగపాటు అని జర్నలిస్టులు విమర్శించారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వ్యతిరేకంగా వార్తాకథనం ప్రచురించినందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెసు కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా సాక్షి కార్యాలయాలపై దాడులకు దిగారు. పత్రిక ప్రతులను దగ్ధం చేశారు.

జర్నలిస్టులకు మాజీ ఎమ్మెల్సీ రెహ్నాన్ సంఘీభావం తెలిపారు. వైయస్ జగన్ వ్యక్తి కాదు, శక్తి అని ఆయన అన్నారు. వైయస్ జగన్ ను అణచివేయడానికి చేసే ప్రయత్నాలు సాగవని ఆయన అన్నారు. కాంగ్రెసు శాసనసభ్యులు చాలా మంది వైయస్సార్ బొమ్మ పెట్టుకుని గెలిచారని ఆయన అన్నారు. వైయస్ జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడిన మంత్రి దానం నాగేందర్ పై ఆయన తీవ్రంగా విమర్శలు చేశారు. రాజీనామా చేసి దానం నాగేందర్ తనపై గెలవాలని ఆయన సవాల్ చేశారు. సాక్షి కార్యాలయాలపై దాడిని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ కూడా ఖండించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+