తీవ్రంగా పరిగణించాల్సిన విషయం: వైయస్ జగన్ వ్యవహారంపై మొయిలీ

కాగా, 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై చర్చించేందుకు పార్టీ అధిష్టానం కాంగ్రెసు పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఢిల్లీకి అహ్వానించింది. ఇందులో భాగంగానే రోశయ్య ఢిల్లీకి వస్తున్నట్లు కూడా చెబుతున్నారు. అయితే, మరో ప్రచారం కూడా జరుగుతోంది. వైయస్ జగన్ వ్యవహారం నుంచి మొయిలీని పక్కకు తప్పించారని, అందువల్ల నేరుగా సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ రోశయ్యతో మాట్లాడి ఢిల్లీకి పిలిచినట్లు చెబుతున్నారు. రోశయ్య ఢిల్లీకి ఎందుకు, ఎలా వెళ్తున్నా వైయస్ జగన్ వ్యవహారంపై, మంత్రివర్గ విస్తరణపై కచ్చితంగా అధిష్టానంతో చర్చించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా, మంగళవారం సాయంత్రం సోనియా రోశయ్యకు అపాయింట్ మెంటు ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications