చిరంజీవిపై తిరుపతిలో సీమాంధ్ర విద్యార్థుల ఆగ్రహం, ధర్నా

ప్రభుత్వ తీరు వల్లనే ఉద్రిక్తతలు నెలకొన్నాయని చిరంజీవి విమర్శించారు. ఇరు ప్రాంతాల్లో సామరస్యవూర్వక వాతావరణం నెలకొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకుని ఉండాల్సిందని ఆయన అన్నారు. హైదరాబాద్ ఆరో జోన్ పై ఏకవాక్య తీర్మానం చేయడం వల్ల సమస్య తలెత్తిందని ఆయన విమర్శించారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉండిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ తీరు వల్లనే సమస్య ఉత్పన్నమైందని, సమస్యను ప్రభుత్వమే పరిష్కరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
కాగా, సోమవారం ఉదయం చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీ నేతలు ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్ కు రేణిగుంట విమానాశ్రయంలో సమస్య తలెత్తింది. మంచు పొగ దట్టంగా అలుముకోవడంతో విమానం దిగడానికి తగిన పరిస్థితులు లేకపోవడంతో గాలిలోనే అర గంట పాటు చక్కర్లు కొట్టింది. అర గంట తర్వాత పొగ మంచు వీడిపోవడంతో విమానం సురక్షితంగా దిగింది.












Click it and Unblock the Notifications