ప్రభుత్వంలో చేరుతామన్న వార్తలు ఊహాజనితాలే: చిరంజీవి

Chiranjeevi
న్యూఢిల్లీ: ఇప్పటికిప్పుడు తమ పార్టీ ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రభుత్వంలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఖండించారు. తాము ప్రభుత్వంలో చేరుతామన్న వస్తున్న వార్తలు ఊహాజనితాలేనని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తన ఢిల్లీ పర్యటనలో కాంగ్రెసుతో పొత్తుపై చర్చలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. పోలవరం, ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని కోరడానికే ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలుస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలని కూడా తాను ప్రధానిని కలుస్తానని ఆయన చెప్పారు. వీలు చిక్కితే కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలుస్తానని ఆయన చెప్పారు.

ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపిస్తున్నారని ఆయన ప్రశంసించారు. ప్రభుత్వంలో సంక్షోభం ఏర్పడినా రోశయ్య తన అనుభవంతో నెట్టుకు రాగలరని ఆయన అన్నారు. రోశయ్య ప్రభుత్వానికి ప్రస్తుతం ఏ విధమైన ఇబ్బందులు లేవని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రజారాజ్యం పార్టీ విలీనం కాదని ఆయన స్పష్టం చేశారు. రోశయ్య ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని ఆయన చెప్పారు. ఢిల్లీకి చేరుకున్న చిరంజీవి నేరుగా హోటల్ కు వెళ్లిపోయారు. మంగళవారం సాయంత్రం ఆయన ప్రధానిని కలుస్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి తాము మద్దతు ఇవ్వాల్సిన అవసరం రాదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+