సివిసి నియామకంపై ప్రధానికి సుప్రీంకోర్టు అక్షింతలు

Supreme Court
న్యూఢిల్లీ: యుపిఎ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నుంచి మరో మొట్టికాయ పడింది. అవినీతిని నిగ్గు తేల్చాల్సిన కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌ (సీవీసీ)గా అవే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఎలా పరిగణనలోకి తీసుకుంటారని నిలదీసింది. క్రిమినల్‌ కేసు పెండింగ్‌లో ఉన్న పి.జె.థామస్‌ను సీవీసీగా ఎలా నియమిస్తారని ప్రశ్నించింది. ఎంపికకు గీటురాయి అయిన మచ్చలేని నిజాయతీని ఆయన నియామకానికి ప్రామాణికంగా తీసుకున్నారా అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.హెచ్‌.కపాడియా నేతృత్వంలోని జస్టిస్‌ కె.ఎస్‌.రాధాకృష్ణన్‌, జస్టిస్‌ స్వతంతర్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వం కూడా అంతే ఘాటుగా స్పందించింది. మచ్చలేని నిజాయతీని గీటురాయిగా తీసుకోవాలంటే న్యాయవ్యవస్థ, రాజ్యాంగ సంస్థల్లోని అన్ని నియామకాలను తిరగతోడాల్సి వస్తుందని అటార్నీ జనరల్‌ జి.ఇ.వాహనవతి అన్నారు.

థామస్‌ ఇటీవల వరకు కేంద్ర టెలికం కార్యదర్శిగా పనిచేశారు. 2జీ స్పెక్ట్రమ్‌ కుంభకోణాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబరు 7న కేంద్రం సీవీసీగా నియమించింది. ప్రధాని మన్మోహన్‌సింగ్‌, హోంమంత్రి చిదంబరం, లోక్‌సభలో విపక్ష నేత సుష్మాస్వరాజ్‌లతో కూడిన త్రిసభ్య కమిటీ సీవీసీని ఎంపిక చేయాల్సి ఉండగా సుష్మాస్వరాజ్‌ థామస్‌ నియామకాన్ని వ్యతిరేకించారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. థామస్‌ నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సెంటర్‌ ఫర్‌ పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ లిటిగేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ లింగ్డో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. థామస్‌ కేరళ ప్రభుత్వంలో పౌరసరఫరాల శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు పామోలిన్‌ దిగుమతి కుంభకోణంలో ఆయనపై అభియోగపత్రం దాఖలయిందని, ఆ కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉండగా సీవీసీగా నియామకం తగదని పిటిషన్లలో పేర్కొన్నారు.

కేంద్ర టెలికం కార్యదర్శిగా కూడా ఇటీవల వరకు ఆయన పనిచేశారని, 2జీ కుంభకోణం నేపథ్యంలో సీవీసీగా నియమిస్తే ద్వి ప్రయోజనాల వైరుధ్యం (కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్స్‌) అవుతుందని వాదించారు. విపక్ష నేత ఈ నియమకాన్ని వ్యతిరేకించినా కేంద్రం బేఖాతరు చేసిందని తప్పుపట్టారు. ఈ పిటిషన్లను స్వీకరించిన సుప్రీంకోర్టు థామస్‌ నియామకంలో అనుసరించిన ప్రమాణాలను క్షుణ్నంగా పరిశీలించాలని గతంలో నిర్ణయించింది. నియామకానికి సంబంధించిన పూర్తి వివరాలతో దస్త్రాన్ని దాఖలు చేయాలని ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+