వైయస్ జగన్ దారి అదే: కాంగ్రెసు నేతలపై దుమ్మెత్తిపోసిన సాక్షి

వైయస్సార్ లెజెంజరీ వారసత్వాన్ని వైయస్ జగన్ అందిపుచ్చుకుంటారని భయపడుతున్న నాయకులు కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించింది. సాక్షి కాంగ్రెసు పత్రిక అని చెప్పేవారు సాక్షి కార్యాలయంపై పోలీసులు దాడులు చేస్తే ఎందుకు ప్రశ్నించలేదని ప్రశ్నించింది. వైయస్సార్ మరణం వెనక కుట్ర ఉందనే వార్తాకథనాన్ని సాక్షిటీవీ చానెల్ ప్రసారం చేసినప్పుడు పోలీసులు దాడులు చేసిన విషయాన్ని గుర్తు చేసింది. వైయస్ జగన్ ఓదార్పు యాత్రను అడ్డుకుని వైయస్సార్ వారసత్వాన్ని అందిపుచ్చుకోకుండా కుట్రలు చేస్తున్నారని విమర్శించింది. సాక్షి వార్తాకథనంపై కాంగ్రెసు నేతలు చేస్తున్న విమర్సలకు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయని వివిధ వార్తాకథనాలను సాక్షి దినపత్రిక ప్రచురించింది.












Click it and Unblock the Notifications