పార్టీకంటే ఎవరూ ముఖ్యం కాదు: పార్లమెంటు సభ్యుడు అజారుద్దీన్

Azharuddin
న్యూఢిల్లీ: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి వ్యతిరేకంగా సాక్షిలో వార్తలు దురదృష్టకరమని పార్లమెంటు సభ్యుడు, మాజీ క్రికెట్ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. ప్రజలు ఎన్నుకున్న అధినేత్రిని విమర్శించడం సరి కాదన్నారు. పార్టీకంటే వ్యక్తులు ముఖ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యక్తులు ఇవ్వాల ఉంటారు, రేపు వెళతారు. కాని పార్టీ ఎప్పటికీ ఉంటుందన్నారు. కార్యకర్తలు పార్టీకే ప్రాధాన్యం ఇవ్వాలని, వ్యక్తలకు ప్రాధాన్యం ఇవ్వకూడదన్నారు. ఎవరైనా పార్టీకి కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. పార్టీకంటే ఎవరూ ముఖ్యం కాదన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి తనకు చిన్నప్పటినుండి స్నేహితుడని ఆయన చెప్పారు. తనకు అన్నింటిలో ఖచ్చితంగా ఉండే వ్యక్తి అని చెప్పారు. ఆయనతో తనకు ఇప్పటికీ మంచి సంబంధాలే ఉన్నాయన్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని కిరణ్ చక్కదిద్దుతారని అజహర్ అభిప్రాయపడ్డారు. కిరణ్ మంచి కెబినెట్ ఏర్పరుచుకొని ప్రజలకు మంచి పాలన అందిస్తారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+