మంత్రివర్గ ఇరకాటంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి

మంత్రివర్గ విస్తరణ చాలా సమస్యలతో కూడుకున్నందువల్లనే పాత మంత్రివర్గాన్నే ఉంచాలనే భావనలో కిరణ్ ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే పాత మంత్రివర్గం ఉండటంపై అధిష్టానంతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా సంతృప్తిగా లేరు. కిరణ్ మంత్రివర్గానికి ప్రాంతీయం, వర్గాలు, కులాల వంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఉద్యమం బూచి చూపి తెలంగాణ వారు తమకు ప్రధాన్యం ఇవ్వాలని ఇప్పటికే ఒత్తిడి చేస్తుండగా, ఉద్యమం పేరుతో తెలంగాణ వారికి ప్రాధాన్యం ఇస్తే మా పరిస్థితి ఏంటని సీమాంధ్రులు ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ అంశంతో పాటు ఎస్సీలు, ఎస్టీలు కూడా తమ వర్గాలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలంటున్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం తమకు న్యాయం జరగాల్సిందేనంటున్నారు. తెలంగాణకు చెందిన ఓ సభ్యుడు తెలంగాణ ఉద్యమం కారణంగా తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు తమ వర్గానికి సముచిత న్యాయం మంత్రివర్గంలో కల్పించాలని డిమాండ్ చేస్తున్నాడు. కిరణ్ కు జగన్ మరో తలనొప్పి. ఆయన వర్గానికి మంత్రవర్గంలో ఇస్తే ఓ సమస్య, ఇవ్వకుంటే మరో సమస్య. మొత్తానికి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్టు తయారయ్యింది ముఖ్యమంత్రి పరిస్థితి.దీంతో ఆయన మంత్రివర్గంలో కొత్త ముఖాలెన్ని, పాత ముఖాలెన్ని, ఏఏ ప్రాంతం వారికి, ఏఏ సామాజిక వర్గం వారికి ప్రాధాన్యం ఉంటుందనేది ఇప్పుడు అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న.












Click it and Unblock the Notifications