దామోదర రాజనర్సింహకు డిసిఎం: 30 - 35 మంది మంత్రులు

మంత్రివర్గ కూర్పులో కిరణ్ కుమార్ రెడ్డి తన ప్రత్యేకతను చూపే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం ఏ సభలోనూ సభ్యుడు కాని మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిని మంత్రివర్గంలో చేర్చుకోడానికి పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. పాలన ఒడుదొడుకులు లేకుండా సాగించడానికి తనకు సరిపోలిన ఆలోచనా ధోరణి(వేవ్‌లెంగ్త్) కలిగిన సురేష్ రెడ్డి అవసరం చాలాఉందని ఆయన అధిష్ఠానాన్ని కోరినట్లు సమాచారం. ఆయనకు ఆర్థికం లాంటి కీలకశాఖ అప్పగించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే దీన్ని గులాంనబీ ఆజాద్ లాంటి పెద్దలు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. కౌంటర్‌గా ఆయన గత ఎన్నికల్లో ఓడిపోయిన షబ్బీర్ అలీ పేరును తెరమీదికి తెచ్చినట్లు సమాచారం. డీఎస్ కూ అలాంటి అవకాశం ఎందుకు కల్పించకూడదని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం ఈ వాదనలతో సంబంధం లేకుండా సురేష్‌రెడ్డి కోసం సోనియాను గట్టిగా కోరుతున్నట్లు చెబుతున్నారు. క్లీన్ ఇమేజ్ ఉన్న సురేష్‌రెడ్డిని తీసుకొని పాలనకు కొత్తరంగు తెస్తానని కోరుతున్నట్లు సమాచారం. ఈ ప్రయత్నాలు ఫలించకపోతే సురేష్‌రెడ్డిని సలహాదారుడి రూపంలోనో, మరో విధంగానో పరిపాలనలో భాగస్వామ్యం చేయడం ఖాయమంటున్నారు. ఇదేసమయంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కూడా తన మనిషిగా ముఖ్యమంత్రి ఎన్నుకున్నట్లు చెబుతున్నారు. పాలనాపరంగా యువకుడైన కిరణ్‌కుమార్ రెడ్డికి ఇబ్బందులు, మొహమాటాలు లేకుండా చేయడానికి కొందరు సీనియర్లను కూడా పక్కన పెట్టాలన్న యోచనతో అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications