ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి టీమ్ లో ఉండేది వీరేనా?

Kiran Kumar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన మంత్రి వర్గ కూర్పుపై అత్యంత గోప్యతను పాటిస్తున్నారు. తమ మంత్రివర్గంలో ఎవరెవరుంటారనే విషయం వెల్లడి కాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయినా మంత్రివర్గంలో చేరేది ఎవరెవరనే విషయంపై ఊహాగానాలు చెలరేగుతూనే ఉన్నాయి. జిల్లాలవారీగా మంత్రి పదవులు దక్కడానికి అవకాశాలున్నవారి పేర్లు ఈ రకంగా ఉన్నాయి.

శ్రీకాకుళం: ధర్మాన ప్రసాదరావు, శత్రుచర్ల విజయరామరాజులకు, మహిళాకోటాలో బొడ్డేపల్లి సత్యవతికి కూడా అవకాశం లభించవచ్చునని చెబుతున్నారు.

విజయనగరం: బొత్స సత్తిబాబు. మంత్రి పదవి లేకుండా ఆయన్ను పీసీసీ అధ్యక్షుడిగా చేస్తే తన కుటుంబానికి చెందిన వారికి మంత్రిపదవికోసం పట్టుబట్టే అవకాశం ఉంది.

విశాఖపట్నం‌: బాలరాజు

తూర్పుగోదావరి: విశ్వరూప్‌ లేదా మహిళా కోటాలో రాజేశ్వరీదేవి. రంపచోడవరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదివాసి తెగకు చెందిన విద్యాధికుడైన ఎస్‌.వి.వి.సత్యనారాయణకు మంత్రిపదవి కోసం కిశోర్‌చంద్రదేవ్‌ పట్టుబడుతున్నారు. తోట నరసింహం పేరు కూడా వినిపిస్తోంది.

పశ్చిమగోదావరి: వట్టి వసంత కుమార్‌, పితాని సత్యనారాయణ.

కృష్ణా: కొలుసు పార్థసారధి.

గుంటూరు: కన్నా లక్ష్మినారాయణ, మోపిదేవి వెంకటరమణ. గాదె వెంకటరెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్‌ల భవితవ్యం ఇతర జిల్లాల్లో సామాజిక సమీకరణలపై ఆధారపడి ఉంది. గాదె వియ్యంకుడు డీఎల్‌ రవీంద్రారెడ్డికి మంత్రిపదవి ఇస్తే గాదెకు అవకాశంలేనట్లే.

ప్రకాశం: ఎం.మహీధర్ ‌రెడ్డి లేదా గొట్టిపాటి రవికుమార్‌. గుంటూరు జిల్లా సామాజిక సమీకరణలను బట్టి వీరిలో ఆ ఒక్కరెవరనేది తేలుతుంది.

నెల్లూరు: ఆనంరామనారాయణరెడ్డి.

చిత్తూరు: గల్లా అరుణ. అనూహ్యంగా ఈ జిల్లాను ఖాళీగానూ ఉంచవచ్చు.

కడప: వై.ఎస్‌.వివేకానందరెడ్డి, డీ.ఎల్‌.రవీంద్రారెడ్డిఅహ్మదుల్లా. ఇక్కడి నుంచి ఇద్దరికే అవకాశం ఇవ్వాలనుకుంటే కొంత ఇబ్బంది తప్పదు.

అనంతపురం: రఘువీరారెడ్డి. జేసీదివాకరరెడ్డి విషయం అధిష్ఠానం నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఎస్సీల్లో మాదిగ కోటాను బట్టి శైలజానాధ్‌కు అవకాశం ఉంటుంది.

కర్నూలు: టీజీవెంకటేష్‌, ఏరాసుప్రతాప్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌: జూపల్లి కృష్ణారావు. సామాజిక సమీకరణలను బట్టి డీకే అరుణ భవితవ్యం ఆధారపడి ఉంది. అయితే మహిళా కోటాయే ఆమెకు రక్ష.

రంగారెడ్డి: సబితా ఇంద్రారెడ్డి.

హైదరాబాద్‌: దానం నాగేందర్‌, ముఖేష్ ‌గౌడ్‌. మర్రి శశిధర్ ‌రెడ్డి, శంకర్రావుల విషయంలో అధిష్ఠానం నిర్ణయం కీలమయింది.

నల్గొండ: జానారెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమకుమార్ ‌రెడ్డిల మధ్య తీవ్ర పోటీఉన్నా ఉత్తమ్‌కు చీఫ్‌విప్‌ ఇచ్చి కోమటిరెడ్డికి మళ్ళీ అవకాశం ఇవ్వొచ్చు.

ఖమ్మం: రాంరెడ్డి వెంకట్‌రెడ్డి. ఇతర జిల్లాల సమీకరణలు, ఎస్సీకోటా పెరగడం వంటి కారణాలతో మల్లు భట్టి విక్రమార్కకు కూడా అవకాశం దక్కవచ్చు.

మెదక్‌: దామోదర్‌ రాజనరసింహకు ఉపముఖ్యమంత్రి పదవి ఖాయమే. స్పీకర్‌ కాకుంటే గీతారెడ్డి కొనసాగుతారు. మహిళా కోటా కింద సునీతా లక్ష్మారెడ్డి నిలబడతారా పదవి కోల్పోతారా అనేది తేలడం లేదు.

కరీంనగర్‌: దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు.

వరంగల్‌: బస్వరాజు సారయ్య, పొన్నాల లక్ష్మయ్య లేదా గండ్ర వెంకటరమణారెడ్డి.

నిజామాబాద్‌: సురేష్‌రెడ్డి కాకుంటే సుదర్శనరెడ్డి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+