ఊడిన సలహాదారు పదవి: కెవిపి రామచందర్ రావు హవాకు కత్తెర

కేవీపీ ఆదివారం మధ్యాహ్నం ఏపీ భవన్‌లోని ముఖ్యమంత్రి కాటేజీకి వచ్చి కిరణ్‌తో 20 నిమిషాలపాటు భేటీ అయ్యారు. అప్పుడే ఆయనకు రాజీనామా చేయాల్సిన అవసరాన్ని కిరణ్ వివరించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కేవీపీ గంటన్నరపాటు ఏపీ భవన్‌లోని తన గదిలో కూర్చొని ఇతర నేతలతో చర్చల్లో మునిగిపోయారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. కేవీపీపై వ్యతిరేకతతో కాకుండా కొత్త ప్రభుత్వానికి క్లీన్ ఇమేజీ కల్పించడం కోసమే ఆయన్ను తప్పించాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ రంగాలకు సంబంధించి మొత్తం 40 మంది వరకు సలహాదారులున్నారు. వీరిలో కొందరు మాజీ అధికారులు కాగా, మరికొందరు వైఎస్ కుటుంబీకులు. మిగిలిన వారు వైఎస్‌కు లేదా కేవీపీకి సన్నిహితులు. పాలనాపరంగా ముఖ్యమంత్రి కిరణ్ పూర్తి స్వేచ్ఛగా పని చేసేందుకు వీలుగానే అధిష్ఠానం సలహాదారులపై వేటు వేసింది.












Click it and Unblock the Notifications