కాంగ్రెసు అధిష్టానంపై ఎంపి సబ్బం హరి తిరుగుబాటు స్వరం

Sabbam Hari
విశాఖపట్నం: వైయస్ జగన్ రాజీనామాతో మరో పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి కాంగ్రెసు పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు స్వరం వినిపించారు. వైయస్ జగన్ రాజీనామా కాంగ్రెసు పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వైయస్ జగన్ తో పార్టీ అధిష్టానం సయోధ్యకు తాను ప్రయత్నించబోనని ఆయన అన్నారు. తాను పార్టీ నుంచి వెళ్లిపోతానని మీడియా అంటోందని, తాను వెళ్లిపోతానని చెప్పలేదని ఆయన అన్నారు. తనతో పాటు మరో ముగ్గురు పార్లమెంటు సభ్యులు కఠిన నిర్ణయాలు తీసుకుంటారని ఆయన అన్నారు.

ప్రజారాజ్యం పార్టీని ప్రభుత్వంలో చేర్చుకోవడానికి తాను వ్యతిరేకమని, ఆ విషయాన్ని తాను పార్టీ అధిష్టానానికి తెలియజేస్తానని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీకి చెందిన శాసనసభ్యులకు మాత్రమే మంత్రి పదవులు ఇవ్వాలని, ప్రజారాజ్యం పార్టీకి ఇవ్వకూడదని ఆయన అన్నారు. విశాఖపట్నంలోని సబ్బం హరి నివాసంలో వైయస్ జగన్ అనుచరులు సమావేశమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+