కాంగ్రెసు కుటుంబాల్లో చిచ్చు పెడుతోంది: వైయస్ జగన్ క్యాంప్ దాడి

అధిష్టానం ఈ తరహా కుట్రలు ఇది మొదటిసారి కాదని వారు ఆరోపిస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయడానికి ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన ఎన్టీ రామారావు కూతురు పురంధేశ్వరిని దగ్గరకు తీసుకుందన్నారు. నారా చంద్రబాబునాయుడు రామ్మూర్తినాయుడిని సైతం తెలుగుదేశం పార్టీకి దూరం చేసే కుట్రలు చేసిందంటున్నారు. భారతీయ జనతా పార్టీలో ఉన్న దగ్గుపాటి వెంకటేశ్వరరావును సైతం కాంగ్రెసు మచ్చిక చేసుకుందని దుయ్యబట్టారు. అధిష్టానం కుటుంబంలోని వారికి పదవులు ఆశజూపి కుటుంబంలో చిచ్చు పెట్టుతున్నాయన్నారు. కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి మొదటి నుండి కాంగ్రెసు లో లేని వ్యక్తి అని, ఆయనకు జగన్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.












Click it and Unblock the Notifications