వైయస్ జగన్, వైయస్ వివేకానందల మధ్య తుది చర్చలూ విఫలం

చివరగా, కుటుంబ సభ్యుల జోక్యంతో వైయస్ జగన్ వైయస్ వివేకానంద రెడ్డితో రాజీకి ప్రయత్నించారు. చీలిపోతే కుటుంబం పరువు పోతుందని చెప్పడంతో వైయస్ జగన్ బాబాయ్ తో చర్చలు జరపడానికి మంగళవారం రాత్రి పులివెందుల నుంచి కడపకు బయలుదేరి వచ్చారు. అయితే, ఇరువురి మధ్య చర్చలు ఫలించలేదు. వైయస్ వివేకానంద రెడ్డి హైదరాబాదుకు బయలు దేరి వెళ్లారు. ఆ తర్వాత వైయస్ జగన్ చాలా సేపు సుబ్బారెడ్డి నివాసంలోనే ఉన్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ చర్చలు జరిగాయి.












Click it and Unblock the Notifications