ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కె. చంద్రశేఖర రావు వార్నింగ్

K Chandrasekhar Rao
హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె. కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు హెచ్చరించారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఆయన కిరణ్ కుమార్ రెడ్డిని హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు వారి అంతర్గత వ్యవహారమని ఆయన మంగళవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరిగే పిల్లిమొగ్గలు, చిల్లర రాజకీయాలపై తమకు ఆసక్తిలేదన్నారు. 2014లో 41 ఎంపీ స్థానాలు గెలిపించి రాహుల్‌గాంధీని ప్రధానిని చేస్తామన్న సీఎం కిరణ్‌కుమార్‌ మాటలను ప్రస్తావిస్తూ అప్పటి వరకూ తెలంగాణ ఏర్పడదా? అని విలేకరులు ప్రశ్నించగా కేసీఆర్‌ తీవ్రంగా స్పందించారు. కొత్త సీఎం ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, ఆయనకేమీ తెలియదని వ్యాఖ్యానించారు. ఆయనను సీఎంను చేసిన పార్టీ అధిష్ఠానమే గత డిసెంబర్‌ 9న తెలంగాణపై ప్రకటన చేసిందని గుర్తుచేశారు. 2011లో ప్రత్యేక రాష్ట్రం వచ్చి తీరుతుందన్నారు.

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందామని తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌పార్టీ శ్రేణులతో చెప్పారు. వివిధ సంస్థలు చేసిన సర్వే నివేదికల ప్రకారం ఇప్పటికిప్పుడు మధ్యంతర ఎన్నికలు వస్తే తెరాసకు కనీసం 70-80 స్థానాలు వస్తాయని వివరించారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో తెరాస కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడారు. వచ్చే 7 నెలల్లో రాష్ట్ర రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉన్నట్లు ఆయన చెప్పారు. ఇది తెలంగాణ ఏర్పాటుకు అనుకూలమని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఏర్పాటే తమ పార్టీ లక్ష్యమని, గమ్యమని పునరుద్ఘాటించారు. రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమైన రాజకీయ వ్యూహాన్ని అనుసరించాలని నిర్ణయించారు. తమ పార్టీ కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తుందని కొన్ని మీడియా సంస్థలుప్రచారం చేస్తున్నాయని, ఇది మంచిదికాదన్నారు. ఈ విషయంలో తమ అభిప్రాయాన్ని, వివరణ తీసుకోవాలని సూచించారు.

ఢిల్లీ పెద్దలకు తెలంగాణ సత్తా తెలిపే విధంగా ఈ నెల 9న వరంగల్‌లో మహాగర్జన సభ నిర్వహిస్తామని కేసీఆర్‌ చెప్పారు. ఎన్సీపీ నేత పీఏ సంగ్మా, స్వామి అగ్నివేశ్‌ అతిథులుగా హాజరవుతారని చెప్పారు. సభ నిర్వహణ కోసం పార్టీ చేపట్టిన కూలీపనికి మంచి స్పందన వచ్చిందని రూ.2.5 కోట్ల కూలీ లభించిందన్నారు. నిధుల సమీకరణకు సహకరించినవారికి కృతజ్ఞతలు చెప్పారు. అమెరికా నుంచి 5,000 డాలర్లు విరాళం వచ్చిందని తెలిపారు. లండన్‌లో త్వరలో కూలీపని చేపట్టనున్నామని చెప్పారు. సభకు 25 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామని వివరించారు. ఈ నెల 6 నుంచి నిర్వహించ తలపెట్టిన లారీ, డీసీఎంల సమ్మెను వాయిదా వేసుకోవాల్సిందిగా యజమానులకు కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. 9న మహాగర్జన సభ ఉన్నందున సమ్మెను 10వ తేదీకి వాయిదా వేసుకోవాలని కోరారు. మహాగర్జనకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+