ఉద్యోగులు సహకరించుకుంటే నా వికెట్ పడిపోతుంది: కిరణ్ కుమార్

కొన్ని తప్పులు అనుకోకుండా కూడా జరుగుతాయని, అయితే అవి గ్రహించేలోగా నష్టం వాటిల్లుతున్నదన్నారు. అలా జరగకుండా చూడాలన్నారు. కొందరు తప్పించుకుంటున్నారన్నారు. సచివాలయం రాష్ట్రానికి గుండెకాయ వంటిదన్నారు. గుండె ఆరోగ్యంగా లేకుంటే ఎలా అయితే మనిషికి సమస్యనో సచివాలయం బాగా లేకుంటే ప్రజలకు కూడా అంతే సమస్య అన్నారు. శాలువాలకు, బోకేలకు పెట్టే ఖర్చును ముఖ్యమంత్రి సహాయనిధికి అందిస్తే సంతోషిస్తానన్నారు. మనమంతా ఒక జట్టుగా కలిసి ఉండాలన్నారు.
సచివాలయంలో జరిగే ప్రతి పనిలో కూడా పారదర్శకత ఉండాలన్నారు. సచివాలయ ఉద్యోగుల పనితీరుపై త్వరలో ఓ కమిటి వేస్తామని చెప్పారు. పాలనా వ్యవస్థను సంస్కరించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా కృషి చేయాలన్నారు. పథకాలు అర్హులకు చేరితేనే సత్ఫలితాలు ఉంటాయన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని ఆయన వారితో అన్నారు. ప్రభుత్వానికి రాబడి కూడా ముఖ్యమేనన్నారు. రాబటి ఉంటేనే సంక్షేమం ఉంటుందని తెలియజేశారు.












Click it and Unblock the Notifications