స్పీకర్ గా మల్లు భట్టి విక్రమార్క: చీఫ్ విప్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి?

Mallu Bhatti Vikramarka
హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గం ఏర్పాటు కావడంతో మిగతా పదవులపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. మంత్రివర్గం ఏర్పాటు విషయంలో చివరి వరకు కిరణ్ కుమార్ రెడ్డి గోప్యతను పాటించారు. ఎవరి అంచనాలకు కూడా అది అందలేదు. మీడియా కూడా తమకు ఇష్టం వచ్చిన రీతిలో మంత్రి పదవులు దక్కే అవకాశాలున్నవారి పేర్లను ఇస్తూ వెళ్లాయి. ఇప్పుడు మిగతా పదవుల విషయంలోనూ అటువంటి ప్రచారానికే మీడియా పూనుకున్నట్లు కనిపిస్తోంది.

ప్రస్తుతం చీఫ్ విప్ గా ఉన్న మల్లు భట్టి విక్రమార్కకు శాసనసభ స్పీకర్ పదవి దక్కవచ్చునని ప్రచారం జరుగుతోంది. అలాగే, నల్లగొండ జిల్లా కోదాడ శానససభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చీఫ్ విప్ పదవి లభిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. ఆయనను స్పీకర్ గా ఎంపిక చేయవచ్చునని ఇప్పటి వరకు వార్తలు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+