వైయస్సార్ కుటుంబంలో కాంగ్రెసు అధిష్టానం చిచ్చు పెట్టింది: రోజా

ఇప్పుడు వైయస్ వివేకానందకు మంత్రి పదవి ఆశచూపి జగన్ ను దెబ్బతీయాలని చూస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి బయటకు వెళ్లిపోవటం రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలోకూడా కాంగ్రెసు పార్టీకి పెద్ద దెబ్బ అన్నారు. కాంగ్రెసు పార్టీని కుటుంబంలా చూసుకునే వారిని పార్టీ బయటకు తోసిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీకి 20 ఏళ్ల వరకు తిరుగు లేదని అనుకున్నారని అయితే ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా 20 రోజులు కూడా కష్టమేనన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ఆయన వెంటే తిరిగిన వారు పదవుల కోసం ఆశపడుతున్నారన్నారు. వైయస్ పెట్టిన బిక్ష వల్లనే కొందరు మంత్రులుగా ఎదిగారన్నారు. వారికి సొంతగా నిలబడితే పది ఓట్లు కూడా పడయన్నారు. ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి సినిమాల్లో నటించడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications