జగన్ ను దెబ్బ తీసేందుకు కాంగ్రెసు హైకమాండ్ మరో వ్యూహం?

YS Jagan
న్యూఢిల్లీ: పార్టీకి రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న వైయస్ జగన్ ను దెబ్బ తీసేందుకు కాంగ్రెసు అధిష్టానం మరో వ్యూహాన్ని రచించినట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ ను ఆదిలోనే దెబ్బ తీయాలనే ఎత్తుగడలో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతను శుక్రవారం సాయంత్రం జరిగిన కోర్ కమిటీ భేటీలో దాదాపు రెండు గంటల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల గురించే చర్చించారు. ఈ సమావేశానికి కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీని ప్రత్యేకంగా ఆహ్వానించారు. రాష్ట్రంలోని తాజా పరిణామాలపై మొయిలీ కోర్ కమిటీ సమావేశంలో వివరించారు. రాష్ట్రంపై మరింతగా దృష్టి కేంద్రీకరించాలని సోనియా వీరప్ప మొయిలీకి సూచించినట్లు సమాచారం.

కాగా, కడప పార్లమెంటు సీటుకు, పులివెందుల శాసనసభా స్థానానికి వచ్చే ఏడాది జనవరిలోనే ఎన్నికలు నిర్వహించడం ద్వారా వైయస్ జగన్ ను దెబ్బ తీయాలని కాంగ్రెసు అధిష్టానం ఆలోచిస్తోంది. ఉప ఎన్నికల్లో జగన్ కొత్త పార్టీ తరఫున పోటీ చేస్తారని అంబటి రాంబాబు ఇప్పటికే ప్రకటించారు. ఈలోగా వైయస్ జగన్ పార్టీ పెట్టినా కడప పార్లమెంటు సీటులో, పులివెందులలో ఆయనను దెబ్బ కొట్టేందుకు ఇప్పటికే వ్యూహరచన ఖరారైనట్లు తెలుస్తోంది. జగన్ చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి పులివెందుల శాసనసభా నియోజకవర్గంలో తనకు మద్దకు కూడగట్టుకోవడానికి అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన పులివెందుల నియోజకవర్గంలో శుక్రవారం పర్యటించారు.

వైయస్ జగన్ రాజీనామాను లోకసభ స్పీకర్ మీరా కుమార్ ఇప్పటికే ఆమోదించారు. పులివెందుల శాసనసభా నియోజకవర్గానికి వైయస్ విజయమ్మ చేసిన రాజీనామాను కూడా రేపో మాపో ఆమోదించే అవకాశాలున్నాయి. కడప పార్లమెంటు సీటులో ఉన్న ఇద్దరు శాసనసభ్యులకు, వైయస్ వివేకానంద రెడ్డికి మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా పట్టు సాధించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. మరోవైపు ఈ పార్లమెంటు పరిధిలోకే వచ్చే శాసనసభ్యుడు వీరశివారెడ్డి కూడా వైయస్ జగన్ కు వ్యతిరేకంగా ఉన్నారు. కడప పార్లమెంటు సీటులో వైయస్ జగన్ పై ముప్పేట దాడికి కాంగ్రెసు హై కమాండ్ రంగం సిద్ధం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+