రెండు గంటలలో మూడుసార్లు సభ వాయిదా వేసిన నాదెండ్ల

హోమంత్రి సబితారెడ్డి సమాధానంపై సంతృప్తి చెందని తెరాస, భాజపా సభలో ఆందోళన చేశాయి. విద్యార్థులపై వెంటనే కేసులు ఎత్తివేతకు వారు డిమాండ్ చేశారు. తెరాస ఎంతకూ పట్టు వీడక పోవటంతో నాదెండ్ల మొదటి రెండుసార్లు 15 నిమిషాల చొప్పున సభను వాయిదా వేశారు. రెండవసారి సభ వాయిదా అనంతరం తిరిగి సభ ప్రారంభమయినప్పటికీ విద్యార్థుల కేసులపై స్పష్టమైన వైఖరి కావాలంటూ తెరాస పట్టు బట్టడంతో నాదెండ్ల మూడోసారి సైతం సభను 30 నిమిషాలపాటు వాయిదా వేశారు.
అంతకుముందు ఎంఐఎం ముస్లింలపై విద్యార్థులపై ఉన్న కేసులపై ప్రభుత్వం ప్రకటించలేదని చెప్పింది. ముస్లిం విద్యార్థులపై పెట్టిన కేసులను కూడా ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండు చేశారు. ఓ సమయంలో వారు పోడియంవైపుకు దూసుకు పోవడానికి కూడా ప్రయత్నించారు. కాగా మూడోసారి సభ వాయిదా పడిన అనంతరం నాదెండ్ల ప్రతిపక్ష నాయకులను తన ఛాంబర్లోకి రావాలని కోరారు.












Click it and Unblock the Notifications