కేసులు ఎత్తివేతలో జాప్యం ఎందుకో తెలియదు: డి శ్రీనివాస్
State
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తామని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపాయని అయితే ఆ కేసుల ఎత్తివేత విషయంలో ఎందుకు ఆలస్యం జరుగుతుందో తెలియడం లేదని ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు డి శ్రీనివాస్ శుక్రవారం అన్నారు. ప్రభుత్వం విద్యార్థులపై ఉన్న కేసులు తొందరగా ఎత్తివేయడానికి కృషి చేయాలన్నారు. తెలంగాణ ప్రాంతమైనా, సీమాంధ్ర ప్రాంతమైనా విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలన్నారు. విద్యార్థులు ఆవేశంతో చేసే చిన్నచిన్న పనులపై కఠిన వైఖరి తీసుకోవాలని ప్రభుత్వ ఉద్దేశ్యం కాదన్నారు. నమోదైన కేసులలో 75 శాతం చిన్న కేసులేనని వాటిని వెంటనే ఎత్తి వేయాలన్నారు. ఈసారి జరిగే కాంగ్రెసు ప్లీనరీకి సైతం రాష్ట్రానికి చెందిన ప్రతినిధులు ప్రత్యేక ఆహ్వానితులుగానే హాజరవుతారన్నారు.