హైదరాబాద్: సమైక్యాంధ్ర, తెలంగాణ ఉద్యమాల కారణంగా విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలంటూ విపక్షాలు పట్టుబట్టడంతో ఉప సభాపతి నాదెండ్ల మనోహర్ అసెంబ్లీని మూడుసార్లు వాయిదా వేసిన అనంతరం ఆయన అన్ని పార్టీల ఫ్లోర్ నాయకులను తన ఛాంబర్ కి పిలిపించి మాట్లాడారు. ఉప సభాపతి చాంబర్ కు చేరుకున్న అన్ని పార్టీల నాయకులు నాదెండ్ల మనోహర్ ను విద్యార్థుల కేసు ఎత్తివేతపై ఏక వాక్య తీర్మానానికి డిమాండ్ చేశారు. కేసు ఎత్తివేతపై ఏక వాక్య తీర్మానం చేసిన తర్వాత రైతు సమస్యలపై చర్చించడానికి అన్ని పార్టీల నాయకులు సిద్ధపడ్డారు. అనంతరం అర్దగంట తర్వాత శాసనసభ ప్రారంభమయింది.