అనంతలో బోర్డు తిప్పేసిన సమ్మోహన్ మల్టీమీడియా సంస్థ
Districts
oi-Srinivas G
By Srinivas
అనంతపురం: అనంతపురం జిల్లాలో ఓ మల్టీమీడియా సంస్థ బోర్డు తిప్పేసింది. అనంతపురం లోని సాయినగర్ లో గత కొంతకాలం క్రితం సమ్మోహన్ మల్టీమీడియా అనే ప్రయివేటు సంస్థ వెలిసింది. సంస్థ నిర్వాహకులు నిరుద్యోగులను ఉద్యోగం పేరుతో మభ్యపెట్టి వేలు, లక్షలు గుంజేవారు. నిరుద్యోగులనుండి డబ్బులు గుంజి ఉద్యోగాల కోసం వారిని కార్యాలయం చుట్టూ తిప్పుకునేవారు. సుమారు 60 లక్షల రూపాయల వరకు నిరుద్యోగుల నుండి తీసుకొని నిర్వాహకులు పరారయ్యారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు నిర్వాహకులను అరెస్టు చేశారు.