తెలంగాణను కాంగ్రెసు మూడు సార్లు ముంచింది: కెసిఆర్

K Chandrasekhar Rao
హైదరాబాద్‌: తెలంగాణ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కాంగ్రెసును తప్పు పట్టారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ సభలో ఆయన శనివారం మాట్లాడారు. కాంగ్రెసు తెలంగాణను మూడు సార్లు ముంచిందని ఆయన విమర్శించారు. తెలంగాణలోకి పోలీసు బెటాలియన్లు దిగుతుంటే కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు మాట్లాడడం లేదని, ఆ బలగాలను వెనక్కి పంపాలని, కేంద్ర బలగాలెందుకో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నాయకులు నిలదీయాలని ఆయన అన్నారు. ప్రాణం పోయినా సరే తెలంగాణ ఆగదని ఆయన అన్నారు.

తెలంగాణ ప్రజల సహనాన్ని పరీక్షించవద్దని, సహనం నశిస్తే అసహజ పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆయన అన్నారు. తెలంగాణవాదులంతా ఏకమవుతారనే మాట ఇప్పుడు నిజమైందని ఆయన అన్నారు. బడ్జెట్ సమావేశాలను తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు అడ్డుకుంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుందా అని ఆయన అడిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+