పులివెందుల, కడప ఉప ఎన్నికలు మార్పుకు నాంది: వైయస్ జగన్
Districts
oi-Srinivas G
By Srinivas
కడప: మన రాష్ట్రంలో జరగబోయే మార్పుకు కడపలో, పులివెందులలో జరిగే ఉప ఎన్నికల ఫలితాలే నాంది పలకాలని మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన రెడ్డి ఆదివారం పులివెందులలో అన్నారు. ఆయన ఆదివారం తన కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో జగన్ మాట్లాడారు. రానున్న ఉప ఎన్నికల్లో మనం విజయం సాధించడానికి అందరూ కృషి చేయాలని కోరారు. ఈ ఎన్నికలు ఆత్మగౌరవానికి సంబంధించినవని చెప్పారు. కాగా అంతకుముందు వైయస్ జగన్ పులివెందుల క్రిస్టియన్ లైన్లోని సిఎస్ఐ చర్చిలో పాల్గొని ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం గవర్నమెంటు హాస్పిటల్ దగ్గరలోని ప్రసిద్ధ రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.